లొంగిపోయిన మహిళా మావోయిస్టు

Oct 30,2024 13:16 #Alluri District

జనజీవన స్రవంతిలోకి రండి ఆగ్నేతం వీడండి

ఎ ఎస్ పి పంకజ కుమార్ మీనా
ప్రజాశక్తి-చింతూరు : హింస ఆగ్నేతం వీడి జన జీవన స్రవంతిలోకి రావాలని చింతూరు ఎ ఎస్ పి పంకజ కుమార్ మీనా బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో అయన అన్నారు. ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన సుకుమా జిల్లా, చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని సోడి సుక్కి 25 సంవత్సరాలు మావోయిస్టుల పాటలకు ఆకర్షతురాలై 22 సంవత్సరాల వయసులో సోడి లక్మ. పామేడు ఏరియా కమిటీ ప్రెసిడెంట్ సోడి సుక్కిని ఏ సెక్షన్ ఫస్ట్ ప్లాటున్ పి ఎల్ జి ఏ బెటాలియన్ లోకి తీసుకోవడం జరిగింది. అప్పటినుండి డిసెంబర్ నెల 2022 సంవత్సరం వరకు పి ఎల్ జి ఏ బెటాలియన్ లో ఈమె పని చేసిందన్నారు. మావోయిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలకు విసిగిపోయి పార్టీలో పనిచేసినప్పుడు మావోయిస్టు పార్టీకి చెందిన ఆదివాసి ఇతర నాయకుల నుండి వివక్షత మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం మరియు పార్టీ భావజాలం మీద భ్రమలు తొలగిపోవడం మావోయిస్టు పార్టీకి పట్టుకున్న ప్రదేశాలలో పోలీసులు వ్యక్తి పెరగడం మరియు కొత్త పోలీస్ క్యాంపులు పెట్టడం వల్ల స్వేచ్ఛగా తిరగలేక ప్రాణభయానికి గురికావడం వంటి కారణాలతో లొంగిపోతునట్లు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం పాలసీల ప్రకారం ప్రశాంతమైన జీవితాన్ని గడపటానికి సోడి సూక్కికి ఒక లక్ష రూపాయల రివార్డు మరియు అర్హత ఉన్న అన్ని ఇతర సౌకర్యాలు  అందించబడతాయన్నారు. ఈ సమావేశంలో సిఐ.టి దుర్గాప్రసాద్. సర్ ఇన్స్పెక్టర్ రమేష్. మీ దివాకర్ అసిస్టెంట్ కమాండెంట్ 42 బి ఏం సిఆర్పిఎఫ్ తదితరులు పాల్గొన్నారు.

➡️