కూటమి నేతలకు ధన్యవాదాలు

May 15,2024 23:41
మాట్లాడుతున్న భాగ్యలక్ష్మి

ప్రజాశక్తి- చింతపల్లి: సమిష్టి కృషి సత్ఫలితాన్ని ఇస్తుందని తాను దఢంగా నమ్ముతున్నానని టిడిపి పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్‌, ఎన్డీఏ కూటమి పాడేరు శాసనసభ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో టిడిపి చింతపల్లి మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో చింతపల్లి మండల కమిటీ సభ్యులు పాడేరులో ఆమెను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, తెదేపా జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో పోలింగ్‌ ఆశించిన రీతిలో కూటమి అభ్యర్థులకు అనుకూలంగా పోల్‌ నమోదు అయిందన్నారు. ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసిన తెదేపా జనసేన బిజెపి శ్రేణులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. చింతపల్లి మండల కమిటీతో పాటు కొయ్యూరు మండల ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు ఉన్నారు.

➡️