అజాగ్రత్తగా వెళితే అంతే సంగతులు

రహదారిపై పడిన పెద్ద రంధ్రం

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:ఇటీవల కురిసిన వర్షాలతో మండలంలోని అరకు సమీపంలో బురద గెడ్డ వంతెనకు అనుకుని రోడ్డు రంద్రం ఏర్పడడంతో ఆ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఇది అరకు, పాడేరు ప్రధాన మెయిన్‌ రోడ్డు కావడంతో వాహనాలు నిత్యం రద్దీగా రాకపోకలు రవాణా సాగిస్తుంటాయి. వాహనదారులు ఒకవేళ ఆదమరిచి ఆ గోతులో దిగితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అంత ప్రమాదకరంగా ఉన్నా సంబంధిత అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులు చేసి పూడ్చడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని వాహనదారులు అంటు న్నారు. వాహనదారులు ప్రమాదానికి గురి కాకుండా ముందుగానే అధికారులు మేల్కొని రోడ్డు రంధ్రం మరమ్మతు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

➡️