ప్రజాశక్తి-అరకులోయ రూరల్:రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 13న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తామని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు దగా చేస్తుందని, సూపర్ సిక్స్ ఎన్నికల హామీలపై జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన వినతి పత్రాలు జిల్లా కలెక్టర్లకు అందజేస్తామని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మంగళవారం అరకులోయ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి 20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రైతులు పండిస్తున్న ధాన్యాలు కనీసం మద్దతు ధర ప్రకటించి దళారి వ్యవస్థను అరికట్టలన్నారు. వర్షానికి తడిసిన పాడైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఇబ్బంది పెట్టకూడదని తెలిపారు. ఉచిత పంట భీమను పునరుద్ధరించాలని, రైతులపై అదనపు భారము మోపి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పెంచిన కరెంటు బిల్లు తక్షణమే తగ్గించాలని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ఎస్టి సెల్ కార్యదర్శి పాంగి చిన్నారావు, అరకులోయ టౌన్ షిప్ ఎంపీటీసీ సమార్డి శత్రుగుణ, అరకులోయ వైసిపి నేత కమ్మిడి అశోక్, మండల వైసీపీ నాయకులు ఎం.బాలరాజు, నాగేష్, రామ్ మూర్తి, గోపాల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
