ప్రజాశక్తి-డుంబ్రిగుడ:ఇటీవల రాజమండ్రి, గుంటూరులో జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించిన శెట్టి లోహిత్ మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ను కలిశారు. క్రీడాకారుని అభినందించి డిసెంబర్ నెలలో ఒడిస్సా భువనేశ్వర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో వెళ్లేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి క్రీడారంగంలో ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అన్నారు. చదువుతోపాటు క్రీడారంగంలో మంచి నైపుణ్యత సాధించి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.