ప్రజాశక్తి అనంతగిరి:మండలంలోని వేంగడ పంచాయతీలో సచివాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు స్థానిక జెడ్పిటిసి గంగరాజు ఆధ్వర్యాన సోమవారం పంచాయతీ వార్డు మెంబర్లు వివిధ పార్టీల నాయకులు కలిసి లికిత పూర్వకంగా విన్నవించారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, వేంగడ పంచాయతీలో సుమారు 2500 మంది పైగా జనాభా కలిగి ఉన్నారన్నారు. 16 కిలోమీటర్ల దూరంలో గల పైనంపాడు పంచాయతీలో అప్పటి ప్రభుత్వం ఈ పంచాయతీని విలీనం చేయడంతో ప్రభుత్వం కల్పించే నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వెళ్లలేని పరిస్థితితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం వెంగడ పంచాయతీ కేంద్రంలోనే సచివాలయం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు సివెరి. కొండలరావు, ఉప సర్పంచ్. ఎం గోవింద్, పీసా కమిటీ సభ్యులు ఎం. రామన్న, ఎస్. కళ్యాణ్, పి. భీమన్న, మణిక్ చందర్, సింహాద్రి, అప్పలనాయుడు పాల్గొన్నారు.
