రైల్వే కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మాట్లాడుతున్న సిఐటియు మండల కార్యదర్శి మొస్య

ప్రజాశక్తి -అనంతగిరి: కేకె లైన్‌ కొత్తవలస నుండి అరుకు రైల్వే లైన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి కిల్లో. మోస్య డిమాండ్‌ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. సంవత్సరం పొడవునా పని కల్పించాలని, పీఎప్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ప్రెసిడెంట్‌ సన్యాసిరావు, కార్మికులు జన్ని. దేముడు, పోలయ్య, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️