పొగ మంచుతో ఇక్కట్లు

Jan 12,2025 23:37
పొగ మంచు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలో గత వారం రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. ఎముకలు కోరికే విధంగా చలి ఉంటుంది. రాత్రి నుంచి సుమారు ఉదయం 10 గంటల వరకు చలిమంచు వీడటం లేదు. దీంతో 10 గంటల సమయంలో కూడా వాహనదారులు లైట్లు వేసి పొగ మంచులో ప్రయాణం చేస్తున్నారు. ఉదయం 9 గంటలైనా చలిమంటలు వేసుకుని కాచుకుంటున్నారు. ఎముకలు కొరికి చలి తీవ్రతతో మండల గిరిజనులు బయటికి రావడానికి భయపడుతూ ఇంటికె పరిమితమవుతున్నారు. పెరిగిన చలి తీవ్రతకు స్థానికులు ఇబ్బందు పడుతున్నా మైదాన ప్రాంతం నుంచి తిలకించడానికి వచ్చిన సందర్శకులు మాత్రం చలిమంచును ఆస్వాదిస్తున్నారు.

➡️