ముమ్మరంగా తనిఖీలు

May 13,2024 00:03
తనిఖీలు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు: మండలంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సై రవీంద్ర ఆదివారం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలో వివిధ ప్రాంతాలలో స్పెషల్‌ పార్టీ బలగాలు, సిఆర్‌పిఎఫ్‌తో వాహనాలు, కలవర్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం కావడంతో నగదు, మద్యం రవాణాకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్ర పరిసరాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్‌ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 వరకు ఉంటుందని, ఓటర్లు , వివిధ రాజకీయ నేతలు సహకరించి పోలింగ్‌ సజావుగా జరిగేలా సహకరించాలని ఆయన తెలిపారు.

➡️