ప్రజాశక్తి-డుంబ్రిగుడ: పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం పరిశుభ్రంగా ఉంచుతూ పర్యాటకులను ఆకర్షించే విధంగా చూడాలని ఐటీడీఏ పీవో వి అభిషేక్ సూచించారు. స్వచ్ఛత డ్రై కార్యక్రమంలో భాగంగా స్థానిక పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతంలో ఆయన గురువారం సందర్శించి పరిశీలించారు. పర్యాటకులకు కావలసిన సౌకర్యాలపై స్థానిక అధికారులను, టూరిజం శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛత డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చిరు వ్యాపారులతో, అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన స్థానిక వికరణతో మాట్లాడుతూ చిరు వ్యాపారాలు ఉపయోగించిన మంచినీటి బాటిల్లు, కవర్లు రోడ్డుపై, జలపాతం ప్రదేశంలో పడవేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యాపారులు ఉపయోగించిన చెత్తా చెదారం వేసేందుకు డస్ట్ బిన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు పంచాయతీ ద్వారా ఆశీలు వేలంపాటను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమ్ సాగర్, డిప్యూటీ తహశీల్దార్ ముజీభ్, పంచాయతీ కార్యదర్శి విజరు, టిడిపి మండల అధ్యక్షుడు టి సుబ్బారావు, అధికారులు పాల్గొన్నారు.ఆర్థిక అభివద్ధికి దోహదండుంబ్రిగుడ: రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా ఏర్పాటు చేసిన వన్ ధన్ కలెక్షన్ సెంటర్లో సరుకులు నిల్వ ఉంచి మార్కెట్లో ధర పెరిగిన తర్వాత విక్రయిస్తే ఆర్థికంగా రైతులుతోపాటు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని పిఒ అభిషేక్ చెప్పారు. మండల కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్‌ను పిఓ గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వ ఉంచి ఉన్న రాజ్ మాతో పాటు పలు రకాల పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాణ్యతగా తయారు చేసి విక్రయించడానికి సామబియ్యం, రాగులు పిండి యంత్రాలను కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డి ఆర్‌డిఏ పిడి వి.మురళి, ఏపిఎం, రైతు ఉత్పత్తిదారుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.