ప్రజాశక్తి-డుంబ్రిగుడ:పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతంలో ఆదివారం అధిక సంఖ్యలో పర్యటకులు సందర్శించారు. దీంతో జలపాతం పర్యాటకుల తాకిడితో కిటకిటలాడింది. అరుకు ఉత్సవాలు జరుగుతుండడంతో కూడా పర్యాటకులు ఉత్సవాలను చూడడానికి చివరిరోజు మైధాన ప్రాంతం నుంచి తరలి వచ్చారు. సందర్శిం చిన పర్యాటకులు జలపాతంలో స్నానాలు చేస్తూ సందడి చేశారు.
