భగత్‌ సింగ్‌కు ఘన నివాళి

నివాళి అర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో శనివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.కార్తీక్‌ శ్రీను, పి.జీవన్‌ కృష్ణ మాట్లాడుతూ, దేశంలో సోషలిస్టు వ్యవస్థ ద్వారానే ప్రజలు సమాన హక్కులను పొందుతారని గాఢంగా విశ్వసించిన పోరాటయోధుడు భగత్‌ సింగ్‌ అన్నారు. పిన్న వయసులోనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నా రన్నారు. భగత్‌ సింగ్‌ను యువత స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయం కోసం పాటుపడాలని అన్నారు. విద్యార్థులు తమ సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నూతన విద్యా విధానం రద్దుకు, ధరల కనుగుణంగా మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంపు, అధ్యాపకుల నియామకంపై , పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపధ్యక్షులు పి. చిన్నారావు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️