ప్రజాశక్తి-హుకుంపేట:-కార్మికుల ఉద్యమ నేత కామ్రేడ్ ఎస్.రమేష్ ఏడవ వర్ధంతినీ పురస్కరించుకొని సిఐటియు అనుబంధ యూనియన్ నేతలు గురువారం నివాళులర్పించారు. అనంతరం వైస్ ఎంపీపీ కొండలరావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.కృష్ణారావు మాట్లాడుతూ, కార్మికుల, ప్రజా సమస్యలపై రమేష్ ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన మహిళ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ హైమావతి, నాయకులు పోతురాజు, కొండబాబు పాల్గొన్నారు.