ప్రజాశక్తి -అనంతగిరి: మండలంలోని టోకూరు పంచాయతీ దొరగుడ గ్రామంలో నిర్వహించిన సిపిఎం మహా సభలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూల మాలలు చేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు దీసరి గంగరాజు మాట్లాడుతూ, ఇప్పటికే దేవుడు పేరుతో బీజేపీ పార్టీ రాజకీయ లబ్ధి కోసం మతాల్ని రెచ్చగొడుతుందని తెలిపారు. దీనికి టిడిపి, జనసేన పార్టీÄలు కొమ్ము కాస్తునాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన కార్యదర్శిగా గెమ్మెల భీమరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఎం మండల కార్యదర్శి సోమ్మెల నాగులు, సర్పంచ్ కిల్లో మోస్య, నాయకులు గెమ్మెల దేవన్న, భీమరాజు, మల్లన్న, లక్ష్మణరావు పాల్గొన్నారు