అస్తవ్యస్త రహదారితో అవస్థలు

గతుకుల రోడ్డుపై వెళుతున్న వాహనాలు

ప్రజాశక్తి-అరకులోయ:పర్యాటకేంద్రమైన అరకులోయ ప్రాంతంలో పలుచోట్ల రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో వాహన చోదకులకు నిత్యం ప్రాణ సంకటంగా మారింది. ఈ రోడ్డును మరమ్మత్తు చేయాలని ఎన్ని మార్లు అధికారులకు విన్నవించినా కనీసం స్పందించే నాధుడే కరువయ్యారు. దీంతో నిత్యం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడక తప్పడం లేదు. ముఖ్యంగా అరకులోయ పర్యటక కేంద్రానికి సమీపంలోని పానిరంగిని వద్ద రోడ్డు పూర్తిగా మరమ్మతుకు గురైంది. పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. నిత్యం రోడ్డుపైనే నీరు పారుతుండటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పర్యాటక సీజన్‌ కావడంతో పర్యాటకులు, స్థానికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించవలసిన దుస్థితి ఏర్పడింది. పానిరంగిని గ్రామానికి ఇరువైపులా కూడా ఇదే మాదిరి గోతుల రోడ్లు ఏర్పడి ఉండటంతో అవస్థలు తప్పడం లేదు. సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి అరకు -విశాఖ ప్రధాన రహదారిని మరమ్మత్తులు చేసి గోతులు పూడ్చాలని వాహన చోధకులు, స్థానికులు కోరుతున్నారు.

➡️