ప్రజాశక్తి -గంగవరం. : గంగవరం గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. గంగవరం నుండి అడ్డతీగల వెళ్లేదారిలో నెమలిచెట్టు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీని ఇద్దరు అక్కడికక్కడే మతి చెందారు. అడ్డతీగల గ్రామం గొర్లె శేఖర్, వై రామవరం మండలం బూరుగుపాలెం గ్రామం కారం శ్రీనివాస్ ఎదురెదురుగా బైక్‌లు వస్తూ ఒకరినొకరు ఢకొీట్టడంతో ప్రమాదం జరిగింది .ఈ ప్రమాదంలో వై.రామవరం ఆస్పత్రిలో డేటా ఎంట్రీగా పనిచేస్తున్న అడ్డతీగలకు చెందిన గొర్లె శేఖర్, బూరుగుపాలేనికి చెందిన శ్రీనివాస్ సంఘటనాస్థలిలోనే మృత్యువాత పడ్డారు.ఈ ప్రమాదంలో మరో మహిళకు, బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గంగవరం ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, సంఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సంఘటనాస్థలిలోనే మృతదేహాలు