మూఢనమ్మకాలను వీడనాడాలి

Mar 27,2025 00:17
మ్యాజిక్‌ చేస్తున్న మ్యూజీషియన్‌ గిరిజనులు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ప్రజలు మూఢ నమ్మకాలను వీడనాడాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు త్రిమూర్తులు రెడ్డి అన్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుంబ్రిగూడ గ్రామానికి చెందిన ఎడారి డోంబు సజీవ దహనం గురి అయిన నేపథ్యంలో పోలీసుల సహకారంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో లోతేరులో సందర్శించి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు.మూఢనమ్మకాలపై జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు శ్రీరాములు గిరిజన ప్రాంతంలో జరుగుతున్న మూఢనమ్మకాలపై మోసాలపై వివిధ రకాల మ్యాజిక్‌ షో ద్వారా గిరిజనులు,విద్యార్థులకు చైతన్యం పరిచారు.సైన్స్‌ ను నమ్మాలని మూఢనమ్మకాలను వీడాలని ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంటామని తెలిపారు.గిరిజనులు ఎవరికైనా అనారోగ్యం బాగో లేనప్పుడు ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ను చూపించుకోవాలని అప్పుడే జబ్బు నయమవుతాయని తెలిపారు.మూఢనమ్మకాలు నమ్మి గురువులను, పూజలు దగ్గర వెళ్లి వాళ్ళు చెప్పే మాయమాటలకు నమ్మి మోసపోవద్దన్నారు.ఈ సందర్భంగా అనంతగిరి ఎస్‌ఐ, డి శ్రీనివాస్‌,ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్‌ మాట్లాడుతూ, పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఇంటి పక్కనే మేకలు, ఆవులు, పందులు పెంచడం పరిశుభ్రత పాటించకపోవడంతో మలేరియా, డయేరియా, జ్వరాలు వంటి అనేక జబ్బులు బారిన పడి మూడ నమ్మకాలకు గురువులను సంప్రదిస్తుంటారని జబ్బు తగ్గకపోతే ఆసుపత్రికి తీసుకెళ్తుంటారని చెప్పారు. అరకులోయ మండలంలోని లోతేరు పంచాయితి డుంబ్రిగుడ గ్రామంలో చేతబడి చేస్తున్నాడని అడారి డోంబు ను పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసిన వ్యక్తులకు సుమారు 20 ఏళ్లు వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పారు.గ్రామంలో ఈ మద్య కాలంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారన్నారు.. ఆనారోగ్యం తగ్గక పోవడంతో విషం తాగి చనిపోయిందని విచారణలో తేలిందన్నారు. మరో వ్యక్తి అనారోగ్యం బాగోలేక విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందన్నారు. దీనికి కారణం చేతబడి చేశారనే అనుమానంతో గ్రామస్తులు దాడి చేసి పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసినట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. గ్రామంలో సెల్‌ సిగల్‌ ఉన్నప్పటికీ పోలీసులకు, గ్రామ పెద్దలకు సమాచారం అందించలేదన్నారు. సమాచారం అందించి ఉంటే ప్రాణం దక్కి ఉండేదని అన్నారు. మూఢనమ్మకాలతో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ గుబారు కళావతి, జన విజ్ఞాన వేదిక సభ్యుడు డిగ్రీ కళాశాల ఉపాధ్యాయుడు డాక్టర్‌ శోభన్‌ బోడ్నాయిక్‌, పాస్టర్‌ ఇసాక్‌, పెసా కమిటీ ఉపాధ్యక్షుడు కిల్లో రామన్న, ట్రైబల్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సొసైటీ చైర్మన్‌ పట్టాసి దీప్తి,విఆర్‌ఓ నాగేశ్వరరావు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ తాతబాబు, మహిళ పోలీసులు పాల్గొన్నారు.

➡️