ప్రజాశక్తి -పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ క్యాంపు కార్యాలయం లో గురువారం ప్రజా దర్భార్ నిర్వహించారు ఈ సందర్బంగా సుమారుగా 45 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్బంగా ప్రజలు, ఉద్యోగుల సమస్యల వినతులను రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ స్వీకరించారు.కాశీపట్నం జీసీసీ ఉద్యోగి రిటైర్డ్ అయినా సంబదించిన బెనిఫిట్స్ ఇంకా రాలేదన్నారు. జీసీసీ డి ఆర్ డిపో డీలర్స్ వేతనం పెంచాలని, భాష వాలంటీర్ లకు సి ఆర్ టీ గా మార్చాలన్నారు.డి ఆర్ డిపోలు మరమ్మత్తులు చేయాలనీ వినతి పత్రాలు అందించారు ఈ సందర్బంగా శ్రావణ్ కుమార్ స్పందిస్తూ సమస్యలను సంబంధిత అధికారులకు పంపించి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సాగర సుబ్బారావు, బాకూరు సర్పంచ్ బాకూరు వెంకటరమణ రాజు, దారెలా సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి, శోభకోట సర్పంచ్ పలసీ శశి భూషణం నాయుడు, అండీభ సర్పంచ్ తామర్ల సత్యనారాయణ, హుకుంపేట మండల ప్రధాన కార్యదర్శి సిర్గం కాంతమ్మ, మాజీ సర్పంచ్ కూడా వెంకటరావు, టీడీపీ నాయకులు కర్జ అచ్చిబాబు, స్వామి, గుజ్జెలి బొంజుబాబు, త్రినాధ్ కమలాకర్, మురళి, సాగర్, బుక్క జగదీష్ బలరాం పాల్గొన్నారు