చదువుతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యం

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా తెలిపారు. క్రీడలతో ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవన విధానం కూడా అలవడుతుందన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మినీ స్టేడియంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ విభాగాలలో నిర్వహించిన క్రీడలలో విజేతలకు గురువారం బహుమతులు ప్రదానం చేశారు. వెయిట్‌లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, యోగా క్రీడాకారులు వారి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రదర్శనలో పొల్గొన్న విద్యార్థులను కలెక్టర్‌ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణిం చాలన్నారు. ఈ దిశగా వారికి అవసరమైన ప్రోత్సాహం జిల్లా యంత్రాంగం ఇస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివద్ధి అధికారి జి.రాజరాజేశ్వరి, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కుర్రా భాస్కరరావు, నవోదయ ప్రిన్సిపల్‌ వి.గీతాలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్‌, స్టెప్‌ సిఇఒ , మేనేజర్‌ శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

➡️