ప్రజాశక్తి – గుడివాడ (కృష్ణా) : అమరావతి అభివృద్ధికి సమిష్టిగా కలిసి నడుద్దామని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి అన్నారు. శనివారం రాత్రి స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతి అభివృద్ధికి అందరం సమిష్టిగా కలిసి నడుద్దామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, మనందరం ఆయనకు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటి సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, తెలుగు భాష వికాస సమితి సమన్వయకర్త డిఆర్‌బి ప్రసాద్, వాకర్స్ గవర్నర్ సహకా సుబ్బారావు, డిప్యూటీ గవర్నర్ పామర్తి కేశవరావు, మున్సిపల్ మాజీ ఛ్కెర్మన్ లంకదాసరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి అభివృద్ధికి సమిష్టిగా కలిసి నడుద్దాం – అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి
