అమరావతి స్కానింగ్‌ సెంటర్‌ను ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు

మైలవరం (ఎన్టీఆర్‌ జిల్లా) : మైలవరం పట్టణంలో బస్‌ స్టేషన్‌ పక్కన అమరావతి స్కానింగ్‌ సెంటర్‌ ను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. సామాన్య రోగులకు అందుబాటులో ఉండే విధంగా సేవా దృక్పథంతో స్కానింగ్‌ పరీక్షలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️