అంబేద్కర్‌ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలి : ఎంఎల్‌ఎ

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : అంబేద్కర్‌ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని రాజోలు ఎంఎల్‌ఎ దేవ వరప్రసాద్‌ అన్నారు.శుక్రవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని మలికిపురం పూలే అంబేద్కర్‌ భవనములో ఎస్సీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మరియు బహుజన సమన్వయ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి సభలో ఎంఎల్‌ఎ మందుగా అంబేద్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘసంస్కర్త, విద్యావేత్త, ఆర్థికవేత్త అని కొనియాడారు. ఒక వ్యక్తి అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదని, అలాంటి అరుదైన ఘనత అంబేద్కర్‌కే దక్కిందన్నారు. దేశ స్వాతంత్రం వచ్చాక 1950 నుంచి ఇప్పటివరకు ప్రపంచంలో భారత్‌ బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఘనతకెక్కిందని, అందుకు కారణం అంబేద్కర్‌ ఎంతో ముందుచూపుతో రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ లు రాపాక వరప్రసాద రావు, గొల్లపల్లి సూర్యారావు, బహుజన సమన్వయ సమాఖ్య అధ్యక్షుడు గెడ్డం తులసి భాస్కరరావు, రాష్ట్ర మార్కోఫెడ్‌ డైరెక్టర్‌ గుండుబోగుల పెద్దకాపు ,బహుజన నాయకులు బత్తుల లక్ష్మణరావు, గుబ్బల బాబ్జి, చింతా రాజబాబు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్‌ ,నల్లి శివకుమార్‌, కొల్లాబత్తుల అశోక్‌, మోకా దివాకర్‌, సిహెచ్‌ సూర్యప్రకాశ్రావు, రోక్కాల వెంకట్‌ పలువురు పాల్గొన్నారు.

➡️