అమిత్‌షా క్షమాపణ చెప్పాలి

Jan 19,2025 00:30

నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న వాపమక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు
ప్రజాశక్తి-గుంటూరు :
పార్లమెంట్‌ సమావేశాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి క్షమాణలు చెప్పాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం అమిత్‌షా రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ శనివారం గుంటూరులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. క్షమాణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర పర్యటన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అమిత్‌షా గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌, సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, సిపిఐ (ఎంఎల్‌), ప్రజాపోరు నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వానికి అంబేద్కర్‌ పట్ల, భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదన్నారు. అధికారం చేపట్టిన నాటి నుండి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తూనే ఉందని విమర్శించారు. పార్లమెంట్‌ సాక్షిగా అంబేద్క ర్‌ను అవమానించే స్థాయికి బిజెపి ఉన్మాదం చేరిందని మండిపడ్డారు. అమిత్‌షా వ్యాఖ్యలను ప్రధాని ఖండించకపోవటం సరికాదన్నారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కె.మాల్యాద్రి, సిపిఎం, సిపిఐ జిల్లా నాయకులు ఎల్‌.అరుణ, యం.ఎ.చిష్టీ, బి.సత్యనారాయణ, షేక్‌ ఖాశింవలి, షేక్‌ బాషా, షేక్‌ ఖాశిం షహీద్‌, రాధాకృష్ణమూర్తి, అంజిబాబు, సురేష్‌, హనుమంతరావు, అరుణ్‌ పాల్గొన్నారు.

➡️