అంబేద్కర్ జయంతి నుండి అమలుకు శ్రీకారం
కలెక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వెల్లడి
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో షెడ్యూల్డు కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.21.13 కోట్లతో 509 యూనిట్ల ఏర్పాటుకు షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ రూపొందించిన ప్రణాళికను అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14నుంచి అమలుకు శ్రీకారం చుడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ రుణ ప్రణాళికలో యూనిట్లు ఏర్పాటు చేసిన లబ్దిదారులకు బ్యాంకుల ద్వారా రూ.1174.76 లక్షల మొత్తాన్ని రుణాల రూపంలో బ్యాంకుల ద్వారా అందించనున్నామని, సబ్సిడీ రూపంలో రూ.832.64 లక్షలు అందజేయనున్నామని, లబ్దిదారుని వాటాగా రూ.105.65 లక్షలు వుంటుందన్నారు. షెడ్యూల్డు కులాల యువత ఉపాధి కల్పనకు 32 రకాల స్వయంఉపాధి పథకాల ద్వారా ఆర్ధిక సహకారం అందించనున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో లబ్దిదారునితో రూ.2.50 నుంచి రూ.20 లక్షల వరకు విలువగల యూనిట్లను ఈ పథకాల ద్వారా ఏర్పాటు చేయించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వివిధ రకాల స్వయంఉపాధి అవకాశాలను పొందేందుకు జిల్లాలోని నిరుద్యోగ ఎస్‌సి యువత మే 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ష్ట్ర్‌్‌జూర://aజూశీbఎఎర.aజూషటరర.ఱఅ% వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు పంపాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న స్వయంఉపాధి అవకాశాలను పొందేందుకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవానలి తెలిపారు.