ఆకర్షిస్తున్న మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌

May 12,2024 21:19

చీపురుపల్లి: ఓటరు చైతన్యంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించిన ఎన్నికల అధికారులు ప్రస్తుతం పోలింగ్‌ బూత్‌ నమూనాలతో ఓటరు ప్రక్రియ పై అవగాహన కల్పిస్తుంది. అందులో భాగంగానే మండలంలోని మెట్టపల్లి గ్రామంలో పోలింగ్‌ అధికారులు మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ని ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌ స్టేషన్‌ని పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌గా నామ కరణ చేశారు. ఇక్కడ కేవలం మహిళలు మాత్రమే ఓట్లు వేసేం దుకు వీలుగా రంగుల పువ్వులు, వివిధ సాంస్కృతిక పనిముట్లు రంగుల రూపంలో వేసి అత్యంత సుందరంగా అలంకరించారు. మామిడి తోరణాలు కట్టి ఓటర్లును ఆకర్షించే విధంగా పోలింగ్‌ స్టేషన్‌ సిద్ధం చేశారు. ఈ పోలింగ్‌ స్టేషన్‌ను చూసేందుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చెందిన పలువురు వస్తున్నారు.

➡️