అలరించిన సమ్మర్‌ టాలెంట్‌ షో

Jun 9,2024 23:36 #summer talent show
summer talent show

 ప్రజాశక్తి-సీతమ్మధార : సాయినాథ్‌ కళా సమితి ఆధ్వర్యాన పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సమ్మర్‌ టాలెంట్‌ షో ఎంతగానో అలరించింది. సుమారు 40 మంది చిన్నారులు పాల్గొని క్లాసికల్‌, వెస్ట్రన్‌ డాన్సులతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కళా సమితి వ్యవస్థాపకుడు డాక్టర్‌ అరుణ్‌ సాయికుమార్‌ మాట్లాడుతూ, 24 సంవత్సరాలుగా ఆర్‌ అండ్‌ బి వద్ద గల తమ సంస్థలో వెస్ట్రన్‌, క్లాసికల్‌, మ్యూజిక్‌, మెడిటేషన్‌లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటాలాగే ఈసారి కూడా వేసవి సంగీత, నృత్య శిక్షణ శిబిరం నిర్వహించామని చెప్పారు. నెలరోజులపాటు నేర్చుకున్న అంశాలపై పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు అతిథులు చేతుల మీదుగా బహుమతులు, ధ్రువీకరణ పత్రాలను, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్యాన్సర్‌ రాజు, నాట్యాచార్యుడు లలిత్‌ కుమార్‌ గుప్తా, చల్ల మంజుల, సూర్యకళ, తల్లిదండ్రులు, పిల్లలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️