ప్రజాశక్తి -భీమునిపట్నం : ఇళ్ల కూల్చివేతపై సమగ్ర విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని ఆనందపురం మండలం లొడగలవానిపాలెం బాధితులు, భూసాగు లబ్ధిదారుల కమిటీ సభ్యులతో కలిసి శనివారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా ఏక పక్షంగా తమ ఇళ్లను రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి కూల్చి వేసి నిరాశ్రయులను చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో బాధితులు కె.పద్మ, కె.నరసింగరావు, పలువురు కమిటీ సభ్యులు ఉన్నారు.