కొనసాగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌

కొనసాగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రజాశక్తి – కడప అండర్‌- 23 వన్డే ఇంటర్‌ జోనల్‌ క్రికెట్‌ టోర్నమెంటులో భాగంగా గురువారం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ప్రకాశం జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఈస్ట్‌ గోదావరి జట్టు ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రకాశం జిల్లా జట్టు 46.2 ఓవర్లలో 286 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని రోహిత్‌ 77, అభినవ్‌ 92 పరుగులు చేశారు. ఈస్ట్‌ గోదావరి జట్టులోని శివ 4, వంశి నారాయణ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 287 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ కు దిగిన ఈస్ట్‌ గోదావరి జట్టు 47.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని సాయి శ్రవణ్‌ బ్యాటింగ్లో అద్భుతంగా రానించి 151 పరుగులు (సెంచరీ) చేసి నాటౌట్‌ గా నిలిచాడు. పాండురంగరాజు 37 పరుగులు చేశాడు. ప్రకాశం జట్టులోని నవీన్‌ 2, పార్థసారథి 2 వికెట్లు తీసుకున్నారు. వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ లో అనంతపురం జట్టుపై 26 పరుగుల తేడాతో రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్టు 50.0 ఓవర్లలో 203 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని రాజు 56, స్వామి నాయుడు 43 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దత్తారెడ్డి 3, లోహిత్‌ సాయి 2, దీపక్‌ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 204 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన అనంతపురం జట్టు 37.2 ఓవర్లలో 176 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని యోగానంద 46, జయ కష్ణ 37 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్టులోని మానస్‌ నాలుగు, సుశాంత్‌ నాయుడు వికెట్లు తీసుకున్నారు. కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌ జోన్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్టు 50.0 ఓవర్లలో 8 వికెట్లను నష్టానికి 294 పరుగులు చేసింది. ఆ జట్టులోని హర్షవర్ధన్‌ 63, సాయి పూర్ణ తేజ 55 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌ జోన్‌ జట్టులోని అఖిల్‌ 3, సాకేత్రామ్‌ 2, మాధవ్‌ 2 టికెట్లు తీసుకున్నారు. అనంతరం 295 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌ జోన్‌ జట్టు 45.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ చెట్టులోని రేవంత్‌ రెడ్డి 131 పరుగులు (సెంచరీ) చేశాడు. నిఖిలేష్‌ 54 పరుగులు చేశాడు.

➡️