తడ (తిరుపతి) : తడ మండలంలోని పన్నంగాడు గ్రామం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని బంగారు సారంగన్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. తడ పోలీసు వారు అందించిన సమాచారం మేరకు గుమ్మిడి పూడి పెద్ది కుప్పం పంచాయతీ సామిరెడ్డి కండ్రిగ గ్రామంకు చెందిన బంగారు సారంగన్ (55) తన ఇంటి నుండి కూలి పనికి అని ఉదయం 6 గంటల ప్రాంతంలో బయలు దేరాడు.అయితే 8 గంటల ప్రాంతంలో పన్నంగాడు గ్రామ సమీపంలో ఉన్న బీ జీ ఆర్ కంపెనీ ఎదురుగా నేషనల్ హైవే మీద నెల్లూరు నుండి చెన్నై వైపు మార్జిన్ లో నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆ వాహనం అతని పై నుండి వెళ్ళడం తో బంగారు సారంగన్ అక్కడిక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న తడ పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
