ప్రజాశక్తి-గిద్దలూరు: గిద్దలూరు, శ్రీ వివేకానంద ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గత 40 సంవత్సరాల క్రితం విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తమకు చదువు చెప్పిన గురువులకు పూలమాల మరియు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. 1980 నుండి1984 డిగ్రీ ఫైనల్ ఇయర్ కళాశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు ఆటపాటలతో తాము ఒకే చోట కలిసి చదువుకున్న పాత మిత్రులతో ఆనందంగా గడి పారు. కార్యక్రమానికి స్థానికంగా ఉన్న కొందరు పూర్వ విద్యార్థులు ఒక టీం గా ఏర్పడి నిర్వహణ కార్యక్రమాలను చక్కగా ఏర్పాటు చేయటం పట్ల సమా వేశానికి హాజరైన పూర్వ విద్యార్థులందరూ ఎంతో సంతృప్తి చెందారు.
