నర్సీపట్నంలో ఘనంగా బాలోత్సవం

నర్సీపట్నంలో ఘనంగా బాలోత్సవం

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:నర్సీపట్నం పరిసర ప్రాంతాలలో బాల బాలికలలో ఉన్న సృజనాత్మకతను, కళ నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా శనివారం స్థానిక జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా బాలోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో బాల బాలికల్లో సీనియర్లు, జూనియర్లు, సబ్‌ జూనియర్‌ లు అని మూడు విభాగాల వారీగా వివిధ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు అకడమిక్‌ ఈవెంట్స్‌, కల్చరల్‌ ఈవెంట్స్‌ అనే రెండు విభాగాలుగా చేపట్టారు. అకడమిక్‌ ఈవెంట్స్‌లో చిత్రలేఖనం, వ్యాసరచన, కథారచన, స్పెల్‌ బీ, క్విజ్‌, మట్టితో బొమ్మలు, పద్యం భావం, తెలుగులో మాట్లాడడం, సైన్స్‌ ఎగ్జిబిషన్‌ తదితరవి ఉన్నాయి.కల్చరల్‌ ఈవెంట్స్‌ లో విచిత్ర వేషధారణ, శాస్త్రీయ నృత్యం, దేశభక్తి గీతాలు, ఏకపాత్రాభినయం కోలాటం, ఫ్యాన్సీ డ్రెస్‌ తదితరవి నిర్వహించారు. ఈ పోటీలలో నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో గల వివిధ స్కూలుల నుండి సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలోత్సవం గౌరవ అధ్యక్షులు దస్త్రాల రాఘవేంద్రరావు, అధ్యక్షులు డాక్టర్‌ అధికారి గోపాలరావు, కన్వీనర్‌ కె.త్రిమూర్తులు రెడ్డి, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతకాయల సన్యాసి పాత్రుడు, స్థానిక ప్రధానోపాధ్యాయిని మాధవి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.

➡️