విద్యార్థులు లక్ష్యంతో చదవాలి

మాట్లాడుతున్న గిరిబాబు

 

ప్రజాశక్తి-గొలుగొండ:విద్యార్ధులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యనభ్యసిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు అన్నారు. మండలంలోని చీడిగుమ్మల హైస్కూల్‌లో శనివారం పేర్‌వెల్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జెడ్పీటీసీ మాట్లాడుతూ, ప్రతీ విద్యార్ధికి పది పరీక్షలు ఎంతో కీలకమన్నారు. సమయం తక్కువగా ఉందని, అందరూ శ్రద్దగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

➡️