16న సమ్మెను జయప్రదం చేయండి

16న సమ్మెను జయప్రదం చేయండి

మల్కాపురంలో ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న ఎం.జగ్గునాయుడు

ప్రజాశక్తి- మధురవాడ : ఈ నెల 16న చేపట్టే పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు, ఐద్వా మధురవాడ జోన్‌ కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ముద్రించిన పోస్టర్‌ను కొమ్మాదిలోని సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.అప్పలరాజు, డి.కొండమ్మ, జి.కిరణ్‌, ఐద్వా నాయకులు బి.భారతి, టికె.శారద తదితరులు పాల్గొన్నారు.ములగాడ : అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన సోమవారం హెచ్‌పిసిఎల్‌ గేటు వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, ఐఎన్‌టియుసి జిల్లా కార్యదర్శి బి.నాగభూషణం, ఎఐటియుసి జిల్లా నాయకులు కె.సత్యనారాయణ, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు నక్క లక్ష్మణరావు మాట్లాడుతూ, కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్చి వేసిందని తెలిపారు. ఈ లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థల్లో కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాసు, నిత్యావసర ధరలను అదుపు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో సుమారు 94 శాతంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్‌తో కూడిన సమగ్ర చట్టం చేయాలని కోరారు. బందును జయప్రదం చేసేందుకు ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు డాక్‌ యార్డ్‌ పైప్‌ లైన్‌ నుంచి జింక్‌ గేటు వరకు చేపట్టే బైక్‌ ర్యాలీని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మల్కాపురం జోన్‌ అధ్యక్షులు కె.పెంటారావు, కార్యదర్శి పి.పైడిరాజు, పి.సురేష్‌, జి.నరేష్‌, ఐఎన్‌టియుసి నాయకులు కె.తాతబాబు, ఎఐటియుసి నాయకులు జి.రాంబాబు, టిఎన్‌టియుసి నాయకులు పి.కృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.14న బైకు ర్యాలీ : సిఐటియువిశాఖ కలెక్టరేట్‌ : ఈ నెల 16న పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ 14న బుధవారం నగరంలో పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి ఈ బైకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.కె.కోటపాడు. :ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రంలోని బిజెపిప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న జరిగే పారిశ్రామిక సమ్మెను, గ్రామీణ బందును జయప్రదం చేయాలని ఎపి. రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో రైతులతో మాట్లాడుతూ, 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని. సోమనాథన్‌ కమిటీ సిఫార్సు మేరకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని., ఉపాధి హామీ పని దినాలను 200 రోజు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రజా సంఘాల కన్వీనర్‌ ఎర్ర దేవుడు. రైతులు. పాల్గొన్నారు.అనకాపల్లి : 16న సమ్మెను జయప్రదం చేయాలని ఎఐటియుసి నేతలు పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక సిపిఐ కోడిగంటి గోవిందరావు భవన్‌లో ఎఐటియుసి జిల్లా కన్వీనర్‌ వై.ఎన్‌ .భద్రం అధ్యక్షతన జరిగిన స్థాయీ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ ఏఐటియుసి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీఎస్‌జె. అచ్యుతరావు పాల్గొని మాట్లాడుతూ కులం, మతం పేరుతో మనుషుల మధ్య ద్వేషాలు సృష్టించి, మళ్లీ అధికారంలోకి రావాలన్నా మోడీ ప్రభుత్వ కుట్రలనుతిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సమ్మె వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు, కె.సత్యాంజనేయ, పెంట కోట సత్యనారాయణ, జి ఏసుదాసు, కే లక్ష్మణ, పి.ఎన్‌ ప్రసాద్‌, శరగడం. సుబ్రహ్మణ్యం నేస్తాలు, పరదేశి, మూర్తి, శ్రీరామదాసు అబ్బులు, తాకాసి వెంకటేశ్వరరావు, వాసు, అప్పలరాజు, నూకరాజు పాల్గొన్నారు.నర్సీపట్నం టౌన్‌:ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు పిలుపునిచ్చారు. సోమవారం నర్సీపట్నం సిఐటియు కార్యాలయంలో సిఐటియు కన్వీనర్‌ టి.ఈశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అడిగర్ల రాజు మాట్లాడుతూ, బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగే దేశవ్యాప్త సమ్మెకు కార్మిక, రైతాంగం కలిసి రావాలన్నారు. నిత్యావసర ధరలు, నిరుద్యోగం తీవ్రంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు.విద్యుత్‌ సంస్కరణలను నిలిపివేయాలని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా ఉపాద్యక్షులు సాపిరెడ్డి నారాయణముర్తి, ఎడిఎం జిల్లా అధ్యక్షులు కె.ప్రసన్న, అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు వి.సామజ్య్రం, ప్రాజెక్టు కార్యదర్శి ఆర్‌.రమణమ్మ, కృష్ణవేణి, పరివేణి, ముఠా కార్మిక సంఘం అధ్యక్షులు ఆర్‌.గోవింద్‌ పాల్గొన్నారు.

➡️