రాజుకు అభినందన సభ

Jun 10,2024 13:15 #anakapalle district

ప్రజాశక్తి-చోడవరం : చోడవరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక హై స్కూల్ వద్ద చోడవరం శాసనసభకు ఎన్నికైన కె.యస్.యన్.యస్.రాజుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కె.వి.యమ్. నాయుడు మాట్లాడుతూ నిరాడంబరమైన వ్యక్తిత్వం కలిగిన శాసనసభ్యులు కే ఎస్ ఎం ఎస్ రాజు చోడవరం అనే అభివృద్ధి పథంలో తీసుకు వెళతారా అనడంలో సందేహం లేదన్నారు. తమ అసోసియేషన్ తరపున తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నాయుడు తెలిపారు. శాసన సభ్యులు రాజు మాట్లాడుతూ ఇదే మైధానంలో తాను క్రికెట్, హాకీ, వాలీబాల్ మరియు లాంగ్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ లాంటి ఎన్నో క్రీడలు ఆడానని, చోడవరం నియోజకవర్గం అబివృద్ధి పట్ల విజన్ కలిగి ఉన్నానని, చోడవరంను క్రీడా హబ్ గా తయారు చేయడానికి అందరూ కలిసి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారుచేద్దామని, ఎవరికి ఏ అవసరం ఉన్నా ఇరవై నాలుగు గంటలు చోడవరం అందుబాటులో ఉంటానని, అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.శకుంతుల రావు, సుంకర  సత్యనారాయణ, రమేష్, రమణి, వేపాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️