ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలం బయ్యవరం సాగర్ సిమ్మెంట్ కార్మికులు కు రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ దారునాలపై శనివారం అవగాహన కార్యక్రమం కశింకోట పోలీస్ స్టేషన్ సి ఐ అల్లు స్వామి నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా సీఐ మాటలుడుతూ ఈ రోడ్డు ప్రమాదం లో ఎక్కువుగా ద్విచక్ర వాహన దారులు హెల్మెంట్ పెట్టుకొకుపోవడం వలన చాలా మంది, వారు ప్రాణాలు కోల్పోతున్నారు అన్నారు, ప్రమాదాలలో శరీర అంగవైకల్యాలుకు గురి అవుతున్నారు అని చెప్పారు.. ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులు కోసం తన జీవితాన్ని ఫలంగా పెట్టి నిత్య జీవితంలో తను పనులపై, బైకుపై బయటకు వెళ్ళేటపుడు నుండి తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేవరకు తన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారు తెలిపారు. రోజు వచ్చే టైము కు రాకపోయినట్లు అయితే ఏమైనదో అని ఎంతో ఆతృతగా కంగారూ పడుతూ ఉంటారు అన్నారు మనం క్షేమంగా ఇంటికి వెళ్లాలంటే మనము బైకు నడిపేటపుడు తప్పనసరిగా హెల్మెంట్ ధరించాలి అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం యాజమాన్యం మరియు కార్మికులు, పోలీస్ సిబ్బంది పాలుగున్నారు