బడ్జెట్ కాపీలు దగ్ధం

Feb 5,2025 11:55 #anakapalle district

ప్రజాశక్తి-దేవరాపల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొండి చెయ్యి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో బుధవారం దేవరాపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బడ్జెట్ కాపీలను దగ్దం చేసారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి మాట్లాడారు. ఇది పూర్తిగా ధరలు నిరుద్యోగం ఆకలి పెంచిన ప్రవేటి కరణ పెంచే బడ్జెట్ అన్నారు. ప్రత్యేకహోదా వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన చట్టంలోని హామీలను పక్కన పెట్టిందని తెలిపారు. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు కేటాయింపులు చేయలేదని తెలిపారు. విశాఖ రైల్వే జోన్, ఐఐటి,, ట్రిపుల్ ఐటి, ఐఐఎస్ఈఆర్,గిరిజన యూనివర్శిటీ, సెంట్రల్ యూనివర్శిటీ, దుగ రాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ మెట్రో, ఎయిమ్స్, వెనుకబడిన జిల్లాల నిధులు, రాజధాని నిర్మాణానికి నిధులు ఊసే లేదన్నారు. రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచ బ్యాంక్ రుణాన్నే పదే పదే ప్రస్తా వించారని తెలిపారు తప్ప కొత్తగా కేటాయింపు లేవన్నారు. గత బడ్జెట్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలను వెనుక బడిన ప్రాంతాలకుగా గుర్తించిన ప్పటికి ఒక్క పైసా ఇవ్వ లేదన్నారు. ఈబడ్జెట్లో వాటి ఊసు కూడా లేదని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి ప్తులను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలిపారు. దీనిపై అత్యదిక పార్టీల ఎంపిలు కేంద్రాన్ని నిలదీసారని, మన రాష్ట్రంలోని పవన్ కళ్యాణ్ చంద్ర బాబునాయుడు మాత్రం తేలికుట్టిన దోంగలాగ నోరు మేదప లెదన్నారు. కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను బలి పసువులను చేస్తున్నారని తెలిపారు. ఈ దగాకోరు బడ్జెట్ ను రాష్ట్ర ప్రజలు పూర్తిగా వ్యతి రేకించాలి కోరారు. అయితే మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు గతేడాది రూ.8.622 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత బడ్జెట్లో రూ.3,295 కోట్లు కేటా యించిందని తెలిపారు. అంటే గత ఎడాది కంటే బడ్జెట్ లో రూ.5,327 కోట్లను తగ్గించిందని తెలిపారు ఆర్భాటంగా ప్రకటించిన రూ.11,440 కోట్లు ప్యాకేజీ ప్రస్తావన లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రవే టీకరణ నిలుపుదల గురించి మాట్లాడక పోవడం మోసం చేయడమేనని తెలిపారు. విభజన హామీల్లో భాగంగా ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావన లేదన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ను ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం గాలి కొది లేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది రూ.5,512.50 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.5,936 కోట్లు కేటాయించిందని తెలిపారు. అయితే పునరావసం, పరిహారం ప్యాకేజీ గురించి స్పందించ లేదన్నారు. 65 వేల కోట్లు తాజా అంచనాలకు 33 వేల కోట్లు తగ్గిందని తెలిపారు. నిర్వాసితులకు కోత విధించడానికే ప్రభుత్వం సిద్ధపడడం దుర్మార్గ మన్నారు ఏపికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహంపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టామని గోప్పలు చేప్పుకుంటున్న పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని తెలిపారు. తెలుగు వారి అత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వా నికి తాకట్టు పెట్టె సారని తెలిపారు. వ్వవసాయానికి నిధుల కోరత లేబర్ కోడ్లు అమలు వంటి పనులు చేపట్టిందని తెలిపారు. ఈ బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా మోసం చేసిన కేంధ్ర ప్రభుత్వం విధానాలను ప్రజలు పూర్తిగా వ్యతిరేఖించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూలగుమ్మి ఎర్రునాయుడు, జ ఊశ్వరరావు, ఏరుకులమ్మ పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గోన్నారు.

➡️