ప్రజాశక్తి-దేవరాపల్లి : కూటమి ప్రభుత్వానిది పిరికి పంద చర్యగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న సిపిఎం మండల కార్యదర్శి బిటి దోర అభివర్ణంచారు. బుధవారం వారం దేవరాపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేసారు అనంతరం వారు మాట్లాడారు. నేడు నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా అనకాపల్లి విశాఖ జిల్లాలోని సిపిఎం నాయకులను కార్యకర్తలను గ్రుహ నిర్బంధం చేయడం అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గపు చర్యని పేర్కొన్నారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని అన్నారు. జిల్లాలోని హైడ్రోపవర్ ప్లాంట్లుకు అనుమతి ఇవ్వరాదని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేటి కరణ అపాలని నక్కపల్లి ప్రాంతంలోని బల్క్ డ్రంగ్ పార్క్ లు అపాలని గత కొద్ది రోజులుగా సిపిఎం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుంటే పరిష్కారం చేయ వలసిన కూటమి ప్రభుత్వ ప్రజా ఉద్యమ కారులపై నిర్బంధం ప్రయోగించడం పిరికి బంధ చర్యగా అభివర్ణించారు. ప్రజా ఉద్యమ కారులను ఆరేస్టులు చేయడం అంటే ప్రజలను ఆరేస్టులు చేయడ మేనని తెలిపారు. ప్రజలు అబిప్రయాలను గౌర వించని ఏ ప్రభుత్వానికి పుట్ట గతులు ఉండవని తెలిపారు. నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వస్తే సిపిఎం నాయకులను ఎందుకు అరెస్టులు చేస్తున్నారో సమాదానం చేప్పాలని డిమాండ్ చేసారు, కూటమి ప్రభుత్వ నికి రోజులు దగ్గర పడి ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతుందని అర్ద మౌతుందని తెలిపారు. వెంటనే నిర్బందాన్ని అపాలని డిమాండ్ చేసారు. పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచడం ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శన మన్నారు. విశాఖ ఉక్కును బలిచేసి నక్కపల్లి లో మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు నడుంకట్టడాన్ని సిపిఎం పార్టీ వ్యతి రేకిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు కావస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముడి ఇనుప గనులు కేటాయింపు, సెయిల్లో విలీనం, 18 వేల కోట్లు ప్యాకేజీ సమస్యను పరిష్కారం చేయ కుండా కాలయాపన చేస్తుందని అగ్రహాం వ్యక్తం చేసారు. నక్కపల్లి లో భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం, ప్యాకేజీలు ఇవ్వకుండా పోలీసులను మోహరించి ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసి బల్క్ డ్రగ్ కోసం పనులు పెట్టాలని చూస్తుందని తెలిపారు. తామ అధికారం లోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని, నక్కపల్లిలో భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నేడు ఆ సమస్యలను పరిష్కరించ కుండా సిపిఎం నాయకులను గృహ నిర్భందించడమంటే ప్రజాస్వామ్య హక్కులను ఖూనీచేయడమేనని తెలిపారు. జిల్లాలో పిఎం, సిఎం, రాష్ట్ర మంత్రులు పర్యటనలు సందర్భంగా ముందుగా సిపిఎం నాయకులను నిర్భందించడం, అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని. గతంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎటుంటి అరెస్టులు, గృహ నిర్భందాలు వుండవని గొప్పగా ప్రకటించి, నేడు సిపిఎం నాయకులను ఎక్కడిక్కడ నిర్భందాలు విధించడమంటే వారి మాటలకు చేతలకు ఎంత తేడా వుందో అర్థమవుతుందని తెలిపారు. సిపిఎం నాయకులను అరెస్టు చేయడం అంటే ప్రజల పట్ల, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో అర్ధమౌతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయడం లేదని హైడ్రోపవర్ ప్లాంట్లు కు అనుమతులు ఇవ్వడం లెదన్నారు. ప్రకటించాలని వారు డిమాండ్ చేసారు.