పోలీసు నిర్బందాన్ని ఖండించండి

Jan 9,2025 13:16 #anakapalle district

దేవరాపల్లి : బుధవారం నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా జిల్లాలోని సిపిఎం నాయుకులను కార్యకర్తలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచడం బలవంతంగా అరెస్టులు చేయడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. గురువారం అయిన స్తానిక విలేకర్లు సమావేశంలో మాట్లాడారు విశాఖ ఉక్కును బలిచేసి నక్కపల్లి లో మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు నడుం కట్టడాన్ని సిపిఎం పార్టీ వ్యతి రేకిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఆరునెలలు కావస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముడి ఇనుప గనులు కేటాయింపు, సెయిల్లో విలీనం, 18 వేల కోట్లు ప్యాకేజీ సమస్యను పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తుందని అగ్రహాం వ్యక్తం చేసారు. నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తారని ఉత్తర ఆంధ్రర ప్రజలు ఎదురు చూసారని కనీసం అ ఊసెంత లెదని తెలిపారు. నక్కపల్లిలో భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం, ప్యాకేజీలు ఇవ్వకుండా పోలీసులను మోహరించి ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసి బల్క్ డ్రగ్ కోసం శంఖుస్థాపన చేసారని తెలిపారు. తామ అధికారం లోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని, నక్కపల్లిలో భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నేడు ఆ సమస్యలను పరిష్కరించ కుండా సిపిఎం నాయకులను గృహ నిర్భందించడం జరిందని తెలిపారు రాజీయ్యపెట లో వారికి మద్దతుగా వెళ్లిన జిల్లా కార్యదర్శి తో సహా మరి కోంతమందిని రాత్రి 9 గంటలు వరకు నిర్బంధంలో ఉంచారని అన్నారు చోడవరం మాడుగుల సబ్బవరం పరవాడ కశింకోట మండలాల్లో మహిళలు అని చూడకుండా సిపిఎం మహిళ కార్యకర్తలను హాస్ అరెస్టులు చేసారని తెలిపారు ఈవిదానాలు ప్రజాస్వామ్య హక్కులను ఖూనీ చేయడమేనని.తెలిపారు జిల్లాలో పిఎం, సిఎం, రాష్ట్ర మంత్రులు పర్యటనలు సందర్భంగా ముందుగా సిపిఎం నాయకులను నిర్భందించడం, అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని. గతంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎటుంటి అరెస్టులు, గృహ నిర్భందాలు వుండవని గొప్పగా ప్రకటించి, నేడు సిపిఎం నాయకులను ఎక్కడిక్కడ నిర్భందాలు విధించడమంటే వారి మాటలకు చేతలకు ఎంత తేడా వుందో అర్థమవుతుందని తెలిపారు. సిపిఎం నాయకులను అరెస్టు చేయడం అంటే ప్రజల పట్ల, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో అర్ధమౌతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయడం లేదని హైడ్రోపవర్ ప్లాంట్లు కు అనుమతులు ఇవ్వడం లెదని ప్రకటించాలని వారు డిమాండ్ చేసారు.

➡️