జగన్‌ను కలిసిన ధర్మశ్రీ, అమర్‌నాథ్‌

జగన్‌ను సాలువతో సత్కరించిన ధర్మశ్రీ

ప్రజాశక్తి-అనకాపల్లి

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసిపి అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కరణం ధర్మశ్రీ, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు జగన్‌ ధర్మశ్రీతో సమావేశమయ్యారు. అనకాపల్లి పార్లమెంట్‌ వైసిపి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనకాపల్లి పార్లమెంట్‌ విస్తృత స్థాయి సమావేశాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు, చోడవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్‌ను అక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలకు పరిచయం చేసి చోడవరంలో కూడా సమావేశాన్ని విజయవంతం చేసినందుకు జగన్మోహన్‌ రెడ్డి ధర్మశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. రానున్న ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి కృషి చేయాలని ఈ సందర్భంగా ధర్మశ్రీకి జగన్మోహన్‌ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️