తాండవ జలాశయంలో మత్స్యకారుడు గల్లంతు

Apr 1,2024 14:35 #anakapalle district

ప్రజాశక్తి-గొలుగొండ: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సాలికమల్లవరం సమీపంలోని తాండవ జలాశయంలో ఆదివారం రాత్రి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ సంఘటనలో పొగచెట్లపాలెం గ్రామానికి చెందిన గరగల అప్పారావు అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. మరో మత్స్యకారుడు జెన్నీ పోతురాజు ను సమీపంలో ఉన్న మత్స్యకారులు ఒడ్డుకు చేర్చారు. ఎస్సై కృష్ణారావు ఆధ్వర్యంలో అప్పారావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సంఘటన స్థలానికి వచ్చి గరగల అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు.

➡️