కశింకోటలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ 

May 16,2024 11:11 #anakapalle district

ప్రజాశక్తి – కశింకోట :  కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో, వైద్యాధికారి  తిరుపతిరావు ఆధ్వర్యంలో సమాజ భాగస్వామ్యం డెంగ్యూ వ్యాధి ని నివారిద్దాం అన్నా నినాదంతో కశింకోట డెంగ్యూ  అవగాహన ర్యాలీ గురువారం  నిర్విహించారు. ఆయన  మాట్లాడుతూ ముఖ్యంగా దోమలు మంచినీరు నిల్వ ఉన్నచోట గుడ్లుపెట్టి అభివృద్ధి చెందుతాయి కనుక , అవి పెరగకుండా ఫ్రైడే డ్రైడే అందరు పాటించాలి. అనగా నీరు నిలువ చేయు పాత్రలు ప్రతి వారం ఖాళీ చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు.మరియు దోమ కుట్టకుండా జాగ్రత్తలు దోమతెరలు వాడుట, ఇంట్లో పొగ పెట్టి దోమలను తరిమివేయుట చేయాలని చెప్పారు.జ్వరం వచ్చినచో రక్త పరీక్షలు చేసుకుని, చికిత్సలు తీసుకోవాలనీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాలుగున్నారు.

➡️