కటాఫ్ తేదీలను వ్యతిరేకిస్తూ నిర్వాసితుల ఆందోళన

Sep 30,2024 12:47 #Anakapalli District

ప్రజాశక్తి-నక్కపల్లి  : నక్కపల్లి మండలంలో వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో జరుగుతున్న భూసేకరణలో నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లించుట కొరకు ప్రభుత్వం నిర్దేశించిన 2010, 2011 కటాఫ్ తేదీలను వ్యతిరేకిస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వాసితులు నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. పునరావాసం, పునర్మాణం ప్యాకేజీ, భూములు, చెట్లు, నిర్మాణాలకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించి భూములు స్వాధీనం చేసుకునే తేదీని కటాఫ్ గా పరిగణించి అప్పటికి 18 సంవత్సరాలు నిండి ఇల్లులు కోల్పోతున్న వారికి 25 లక్షలు, ప్రభావిత కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వరకు సభ్యులు ఎం అప్పలరాజు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్, వైసీపీ నేత వీసం రామకృష్ణ , పలువురు నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు.

➡️