ప్రజాశక్తి-యలమంచిలి :
కొక్కిరాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ పనులు కల్పించి ఆదుకోవాలని అక్కడ దినసరి కార్మికులు వేడుకుటున్నారు. మంగళవారం కొక్కిరాపల్లి నూనెగించల పరిశోధన స్థానంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులంతా కలిసి సిఐటియు ఆధ్వర్యంలో పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రతినిధి శివాజీ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా 70 మంది కార్మికులు పని చేస్తున్నారని, రొటేషన్ పద్దతిలో పనులు కల్పించేవారని తెలిపారు. ప్రస్తుతం నువ్వులు మాత్రమే పండించిడం మూలంగా కూలీ పనులు తక్కువగా ఉండడంతో నెలలో కొన్ని రోజులు కూడా కూలి పనులు దొరకడం లేదన్నారు. పరిశోధనా కేంద్రంలో పనులు పెంచి కూలీలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు ధనలక్ష్మి, ఈశ్వర్‌బాయి, శ్రీదేవి, లక్ష్మి, మరికొందరు పాల్గొన్నారు.