కప్పేసిన పొగ మంచు

Jan 23,2025 09:49 #anakapalle district

ప్రజాశక్తి-బుచ్చయ్యపేట (అనకాపల్లి జిల్లా): బుచ్చయ్యపేట మండలాన్ని పొగ మంచు కప్పేసింది. గురువారం తెల్లవారుజామున 4:00 నుండి మంచి దట్టంగా కురిసింది. ఏజెన్సీ ప్రాంతం వలే మైదాన ప్రాంతంలో కూడా మంచు దుప్పటి అలుముకోవడంతో ప్రకృతి ప్రేమికులు మంచు అందాలను ఆస్వాదించారు. దట్టంగా కురిసిన పొగమంచుకు వాహనందారులు ఇబ్బందులు పడ్డారు. ఎదురెదురుగా వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు.

➡️