ప్రజాశక్తి – కశింకోట : తాళ్లపాలెం గ్రామంలో ఉన్న రామాలయం వద్ద, జిల్లా అందత్వ నివారణ సంస్థ అనకాపల్లి వారి సౌజన్యతో మండల టీడీపి అధ్యక్షులు కాయల మురళీధర్ ఆధ్యర్యంలో ఉచిత కంటి వైద్యశిభిరం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ శిబిరంలో శంకర్ ఫౌండేషన్ కంటి వైద్యలు డాక్టర్ అరుణ, శంకర్ 72 మంది కంటి రోగులను పరీక్షలు చేయగా 20 మందికి కంటి ఆపరేషన్ ఎంపిక చేసి శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తరలించారు ఈ కార్యక్రమంలో కూటిమి నాయకులు అప్పికొండ అప్పారావు, సంతోష్, శంకర్ ఫౌండేషన్ క్యాంపు మేనేజర్ ఎం అరుణ్ కుమార్, నర్సిగ్ స్టాఫ్ లావణ్య కంటి రోగులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
