విద్యుత్ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి 

Nov 30,2024 13:27 #anakapalle district

ప్రజాశక్తి-దేవరాపల్లి : రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంపును వెంటనే ఉపసంహ రించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రలో విద్యుత్ ఛార్జీల పెంపుకు ఇ ఆర్ సి ఓకే చెప్పిందని తెలిపారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించిందని అన్నారు. ఇది అత్యంత దుర్మార్గపు అలోచన అని దుయ్య బట్టారు,యూనిట్ కు 92 పైసల చొప్పున రేపటి నుంచి వసూలు చేయాలని,నిర్ణించిందని తెలిపారు. దాదాపు రూ.7,912 కోట్లు ప్రజలపై భారం మోప నుందని తెలిపారు సూపర్ సిక్స్, హమీలుతో అదికారిలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ఇలా ప్రజలును నమ్మించి మోసం చేయడం అన్యాయ మన్నారు. మద్యం ధర తగ్గించినట్లు పోజులు కోట్టిన ప్రభుత్వ విద్యుత్ చార్జీలు పెంచడం ప్రజలపై బారాలు వేయడం సిగ్గు చేటన్నారు. మంచి నూనె పప్పు వెళ్ళుళ్ళి, కంది పప్పుతో పాటు అన్ని రకాల నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగి పోయాయని తెలిపారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కూలిలకు కూలి రేట్లు మాత్రం పెరగలేదన్నారు‌. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగింపును వేగవంతం చేసిందని తెలిపారు. ఒక మీటరు రేటు పదిహేను వేలు నుండి ముప్పై వేలు రూపాయలు ఖర్చుతో అదాని కంపెనీకి అప్పగించిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఈమీటర్లు సేల్ పోన్ టివి డిస్ మాదిరిగా రిచార్జి చేసు కోవడం తో పాటు, మీటరు ఖరీదు బిల్లుతో వాయిదా పద్దతిలో కట్ట వలసిన ఉంటుందని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెరగడం వలన విద్యుత్ పై తయారు అయ్యె ప్రతి వస్తువు ధరలు పెరుగు తాయని ప్రజలుపై మరింత ధరలు బారాలు పడతాయని తెలిపారు. వెంటనే పెంచిన విద్యుత్ చార్జీల పెంపును ఉప సంహరించుకోకపోతే ప్రజలు ఆగ్రహనికి గురికాక తప్పదని వెంకన్న హెచ్చరించారు.

➡️