రోడ్లు వేయండి అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు విజ్ఞప్తి
ప్రజాశక్తి-అనకాపల్లి : వి మాడుగుల, శంకరం పంచాయతీలోని తాడివలస, గోప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కోత్తవలస, మామిడిపాలెం, గిరిజన గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించి కోత్తవలస తాడివలస, ఉరక గెడ్డలపై రెండు బ్రిడ్జిలు నిర్మించాలని ఏడు గ్రామాలకు చేందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు మహిళలు మొకాళ్ళుపై నిలబడి చంద్రబాబు నాయుడు మాగ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి!పవన్ కల్యాణ్ బాబు మా గిరిజన గ్రామానికి రోడ్లు సౌకర్యం కల్పించండి! అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరట.నరసింహమూర్తి, కె భవాని పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఈగ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలని 9 కోట్ల ముప్పై లక్షల రూపాయలుతో రోడ్లు బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు, నమ్మబలికి ఎన్నికల అయ్యి తోమ్మి నెలలు అవుతున్న కనీసం పట్టించు కోలెదన్నారు. వర్షం వస్తే గెడ్డలు దాట లేక గర్బిని స్త్రీలను బాలింతలను డోలిలు కట్టి మోసుకువస్తున్నారని తెలిపారు. పిల్లలు స్కూలుకు వెళ్ళలాన్న ముసలి వారు ఆసుపత్రికి వెల్లాలాన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గోట్టివాడ నుండి కోత్తవలస వెలగలపాడు గోప్పువూరు తాడి వలస మీదుగా రాయిపాలెం రాజంపేట మీదుగా క్రిష్ణం పాలెం తారురోడ్డు వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తె వందలాది మంది గిరిజనులకు రోడ్డు సౌకర్యం కల్పించవచ్చునని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఓక్క గ్రామం ఉన్న రోడ్డు సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం నెరవేర లేదన్నారు. కూటమి ప్రభుత్వలోని, ఎమ్మెల్యే యంపిలు స్థానికులు కావక పోవడం ఇక్కడ గిరిజనులు సమస్యలు తెలియకపోవడం అవగాహనా లేకపోవడం గిరిజను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఈగ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించకపోతే పోరాటం ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోమల నరసింహారావు, జన్ని చిన్నారావు, సోలం సన్యాసమ్మ, సోలం మంగ, గురువుల కృష్ణమూర్తి, సాగరి ఈశ్వరరావు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.