కూటమి ప్రభుత్వం ప్రజా అభివృద్ధి కి ప్రణాళికలు : అనకాపల్లి ఎమ్మెల్యే

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి జిల్లా) : కూటమి ప్రభుత్వంలో ప్రజా అభివృద్ధి ప్రణాళిక జరుగుతుంది అని అనకాపల్లి శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ అన్నారు. కశింకోట మండలంలో ఏనుగుతుని గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ … దీపావళికి వంట గ్యాస్‌ మహిళలకు ఇస్తున్నామన్నారు. గ్రామంలో కావల్సిన వసతలు కల్పించడానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గొంతిని శ్రీనువాసరావు, నిమ్మదల సన్యాసినాయడు, కర్రి సత్యనారాయణ, ఉల్లింగల రమేష్‌, బలిజి ముసిలి నాయుడు, అందె రమణ, వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.

➡️