ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలి

ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలి

తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-శింగనమల

సచివాలయ ఉద్యోగుల ద్వారా వెంటనే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ రమణకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగమే పింఛన్లు, రేషన్‌ పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిందన్నారు. ఇందుకు అనుగుణంగా యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఎండలు తీవ్రంగా ఉండడంతోపాటు పనులు లేని పరిస్థితుల్లో సచివాలయ సిబ్బంది వెంటనే ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ పంపిణీ చేయాలన్నారు. అలాగే ముఖ్యమైన పండుగలు ఉగాది, రంజాన్‌, శ్రీరామనవమి ఉండటంతో రేషన్‌ సరుకులు త్వరగా పంపిణీ చేయాలన్నారు. రాజకీయాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పథకాలను ఉపయోగించుకోవాలని చూడటం మంచిది కాదన్నారు. అలాగే వలసలు వెళ్లకుండా గ్రామాల్లో విరివిగా ఉపాధి పనులు కల్పించాలన్నారు. పెండింగ్‌ బిల్లులు కూలీల ఖాతాలకు జమ చేయాలన్నారు. వేసవి నడికొనడంతో నీరు, టెంటు వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. 200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, వెంకటనారాయణ, కుళ్లాయిస్వామి, సుంకన్న, ఎర్రిస్వామి, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

➡️