‘ఉపాధి’ పనుల పరిశీలన

'ఉపాధి' పనుల పరిశీలన

నార్పలలో ఉపాధి పనులను పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-పెద్దవడుగూరు

మండల పరిధిలోని కాశేపల్లి గ్రామ సమీపంలో జరుతున్న ఉపాధి హామీ పనులను జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌, పీడీ వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సకాలంలో కూలి డబ్బులు అందుతున్నాయా.. లేదా.. రోజుకు ఎంత కూలి పడుతోంది.. తదితర వివరాలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు కూలీలు స్పందిస్తూ కొలతల ప్రకారం కూలి పడుతోందని వివరించారు. ఒక్కొక్క జాబ్‌కార్డుకు వందరోజుల పని చేసి రూ.30వేల వరకూ కుటుంబానికి వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ పుల్లారెడ్డి, ఇసి విజరు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ చాప్రా, ఎఫ్‌ఎస్‌.రమేష్‌రెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

నార్పల : మండలంలోని జంగంరెడ్డిపల్లి, రంగంపేట గ్రామాల్లో మంగళవారం చేపట్టిన ఉపాధి పనులను ఎంపిడిఒ రాముడు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలు సమయపాలన పాటించి ఉదయం 6 గంటలకు అంతా పని ప్రదేశంలో ఉండాలన్నారు. 11 గంటలలోపు పని పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాలన్నారు.

➡️